BDK: బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేని ప్రోలు నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సందర్శించారు. ఎన్నికల కోడ్ అమలు ఉన్న కారణంగా అందుకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. లోటుపాట్లకు తావు లేకుండా పర్యవేక్షించాలన్నారు. ఆయనతోపాటు ఎస్సై మెడ ప్రసాద్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలించారు.