భూపాలపల్లి నూతన మున్సిపల్ కమిషనర్‌గా కొయ్యడ ఉదయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో నూతన కమిషనర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. అనంతరం కలెక్టర్ నూతన మున్సిపల్ కమిషనర్‌కు పలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.