BDK: ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలంలోని సిరిపురం, మర్రిగూడెం సీతంపేట గ్రామాలలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి హరి నాయక్ తడిసిన మొక్కజొన్న, వరి పొలాలను శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి రైతులు నష్టపోయారని, ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.