BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రంజిత్ ఆధ్వర్యంలో స్తంభాలకు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. రంజిత్ మాట్లాడుతూ.. రాబోయే బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా గ్రామంలో వీధిలైట్లు బిగించామని తెలిపారు. గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఎంపీవో రాంప్రసాద్, కార్యదర్శి రంజిత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.