VSP: విశాఖ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డా. ఎం.అంగముత్తుకు ముంబై పోర్ట్ అథారిటీ ఛైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర పోర్టులు, నౌక, జల రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన విశాఖ పోర్టుకు ఛైర్మన్గా ఉన్న సమయంలో విశాఖ పోర్టు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించింది.