SRD: సంగారెడ్డి వైద్య కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావీణ్యకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. మెడికల్ కళాశాలలో 56 మంది కార్మికులు పనిచేస్తున్నారని వీరిపై పని భారం పెరిగిందని సంఘం నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ పాల్గొన్నారు.