VKB: జిల్లా పరిధిలోని సూర్య ప్రకాష్ కాలనీ సమీపంలో బస్సులు ఆపడం లేదంటూ స్థానికులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఆదివారం పరిగి వెళ్లే మార్గంలో కాలనీ కౌన్సిలర్ విజయరాజు నేతృత్వంలో ప్రజలు ఆందోళన చేపట్టారు. గతంలో ఇక్కడ రెగ్యులర్‌గా బస్సులు ఆగేవని, కానీ కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడవి స్టాప్‌లో ఆగకుండానే దూసుకెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.