ADB: అమ్మాయిల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో సమావేశమై మాట్లాడారు. ఇటీవల భీంపూర్ మండలంలో పదవతరగతి బాలిక అక్రమ రవాణా ఘటన జరగటం బాధాకరమన్నారు. అమాయకపు పేద ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తూ ఇతర రాష్ట్రాలకు అమ్మడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.