KNR: కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు వాయు కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ సక్రమంగా లేకపోవడమే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 16 కోట్లతో బయో మైనింగ్ సిస్టంతో చెత్త తొలగింపు ప్రక్రియ చేపట్టినా అది సత్ఫలితాలు ఇవ్వకపోవడమే కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమను కాలుష్యం నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.