ADB: విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ అశోక్, సిబ్బంది తదితరులు ఉన్నారు.