BDK: సింగరేణి పురిటిగడ్డ ఇల్లందు పేరు వెనుక ఓ చారిత్రక నేపథ్యం ఉంది. 1871లో భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ విలియంకింగ్ ఈ ప్రాంతంలో బొగ్గునిక్షేపాలను కనుగొన్నారు. 1886 నుంచి గనులతవ్వకం ప్రారంభం కాగా ఇక్కడి వాతావరణం, పరిస్థితులు చూసి బ్రిటీషర్లు దీనిని ఇంగ్లాండ్ 2గా పిలిచేవారు. కాలక్రమేణా ఆ ఇంగ్లాండ్ అనే పదం ఇల్లందుగా రూపాంతరం చెందిందని చరిత్రకారులు చెబుతుంటారు.