ASF: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అటవీ అధికారుల వేధింపులను నుండి ఉపశమనం కలిగించాలని హౌసింగ్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సిర్పూర్ MLA హరీష్ బాబు కోరారు. సోమవారం హౌసింగ్ శాఖపై సమీక్షలో MLA పాల్గొన్నారు. నియోజకవర్గంలోని మండలాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెట్టి బిల్లులు రాకుండా చేస్తున్నారని విమర్శించారు.