BDK: బూర్గంపాడు మండలం సందేల్ల రామాపురం గ్రామంలో శుక్రవారం సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజనుల ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన గొప్ప పండగ అని తెలిపారు.