ఖమ్మం నగరాన్ని క్లీన్ & గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో గురువారం 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రణాళికను అత్యంత క్రమశిక్షణతో నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. అలాగే అధికారులకు పలు సూచనలు చేశారు.