ASF: రెబ్బెన మండలం కైరిగూడలో ఆదివారం సాయంత్రం సంభవించిన పిడుగుపాటుకు భార్యా భర్తలు ఇద్దరు మృతి చెందారు. చేనులో వ్యవసాయ పనులు చేసుకుంటున్న టేకం భీమ్రావు, టేకం రాజుబాయిపై ఒక్కసారిగా పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.