NLG: అనుములలోని హాలియాలో మైనర్ డ్రైవింగ్‌పై శుక్రవారం ఎస్సై సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్లు నడుపుతున్న10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక స్పెషల్ డ్రైవ్‌లో వాహనాలు ఇచ్చిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, మోటార్ వెహికల్ యాక్టర్ ప్రకారం చలానాలు విధించారు.