NGKL: అచ్చంపేట మండలం శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని ఆదివారం సినీ హీరో మహేష్ బాబు సోదరి వారి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి అర్చకులు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు.