NZB: పోతంగల్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్ గురువారం విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు. ఇంటి డాబాలపై వైర్లు కట్టి బట్టలు ఆరేయకూడదని, తెగిపడిన విద్యుత్ తీగలను అస్సలు తాకరాదని సూచించారు. వర్షం పడినప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్, చెట్ల కొమ్మలను తాకవద్దని విద్యార్థులకు వివరించారు.