NLG: భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. వరుసగా కురిసిన వానలకు గ్రామీణ రోడ్లతో పాటు రాష్ట్ర, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ కంకర తేలి, గుంతలు పడ్డాయి. ప్రభుత్వం మాత్రం కనీసం మరమ్మతు కూడా చేపట్టడంలేదు. జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.