JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పామునూరులో శనివారం విద్యుత్ షాక్‌తో కోట వాసు మృతి చెందాడు. ఈ ఘటనపై విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివారం గ్రామస్తులు, బంధువులు స్టేషన్ ఘనపూర్ సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. 24 గంటలైనా అధికారులు ఎవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు.