మేడ్చల్: బోడుప్పల్లో 29వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణగా జీవించాలి, మనకు మనం రక్షించుకోవాలని చిన్నారులంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారని తెలిపారు. గెలిచినా, ఓడినా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్‌తో మరింత ముందుకు వెళ్లాలన్నారు.