NGKL: పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు అడ్డంగా ఉన్న సైబర్ నెట్ కేబుల్లను శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు తొలగించారు. దీంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 15 అడుగుల ఎత్తులో కేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించిన ఆపరేటర్లు పట్టించుకోకపోవడంతో చర్యలు చేపట్టినట్లు విద్యుత్ AE మాన్య నాయక్ తెలిపారు.