KMM: జిల్లా వ్యవసాయ మార్కెట్లో మోడల్ మిర్చి మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్ నిర్మాణంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా శరవేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.