NRML: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని తానూర్ ఎంపీడీవో శ్రీధర్ సూచించారు. శనివారం కోలూర్ గ్రామంలో పర్యటించి, లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. మంజూరైన ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు.