RR: రాష్ట్రానికి కావాల్సిన యూరియాను అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాయక్ అన్నారు. యూరియా రాష్ట్రానికి తెప్పించి రైతులకు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్‌లోని PACS సొసైటీ వద్ద రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.