ASF: జిల్లాలో RTI జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.కమలాకర్ బుధవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. దరఖాస్తుదారులకు చట్ట ప్రకారం గడువులోపు సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.