SRD: కార్తీక పౌర్ణమి సందర్భంగా బొట్టుపల్లి వీరభద్ర స్వామి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే భక్తులు స్వామివారి దర్శనార్థం తరలి వచ్చి, ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, హారతులు నిర్వహించారు. పౌర్ణమి పర్వదినం కావడంతో ఆలయం నిండా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. భక్తులు ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు.