NZB: నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు శనివారం రాత్రి ఒకటో ఠాణా పోలీసులు రైడ్ చేశారు. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తన బృందంతో కలిసి సదరు లాడ్జిపై దాడి చేయగా.. ఓ జంట రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. దీంతో మహిళతోపాటు విటుడు, లాడ్జి మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.