ఖమ్మం: త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వి. చంద్రమౌళి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రచురణ, ఎన్నికల నియమావళిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.