PPM: జిల్లాలో కురుపాం కేంద్రంగా మంజూరైన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెంటాడలో నిర్మిస్తున్న గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఏళ్లు గడుస్తున్న నేటికీ పూర్తి చేయకపోవడంతో గిరిజనులను మోసం చేయడమేనని అన్నారు.