WGL: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని గోడలకు తాకితే కరెంట్ షాక్ తగులుతోంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తు GWMC అధికారులు గోడలను తాకితే షాక్ కొడుతుందని గోడలపై అంటించడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. నిరంతరం నగర ప్రజలతో రద్దీగా ఉండే ఆఫీసులో మరమ్మతులు చేయాల్సిన అధికారులు ఇలా వాల్ పోస్టర్లు అంటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.