వనపర్తి మున్సిపాలిటీ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మాధవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పన్నులను మున్సిపాలిటీ గుర్తింపు ఉన్న సిబ్బందికి మాత్రమే చెల్లించి ఆన్లైన్లో రశీదు పొందాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నులు చెల్లించవచ్చన్నారు. గడువు తేది లోపు చెల్లించాలని అన్నారు.