SRD: తుఫాన్ కారణంగా ప్రజలు విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిర్గాపూర్ మండల ఏఈ శోభారాణి బుధవారం తెలిపారు. తడిసిన కరెంటు స్తంభాలు, తడిసిన చేతులతో స్టార్టర్ మోటర్లు ముట్టుకోరాదన్నారు. గాలి దుమారం వర్షం వల్ల తెగిన విద్యుత్ వైర్లను తాకరాదన్నారు. కరెంటు లైన్ కింద సెల్ఫోన్ మాట్లాడరాదని చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తెలపాలన్నారు.