ఖమ్మం జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు గ్రామాలు పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను 10 రోజుల్లో క్లియర్ చేయాలని సూచించారు.