JN: దేవరుప్పుల మండలం పెద్దతండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడే అవకాశం ఉందని కుప్పలు పోసి చాలా రోజులు అవుతుందని పలువు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.