CTR: చిత్తూరు జిల్లాలో మామిడి పంట పండించిన రైతులకు 4 రూపాయలు సబ్సిడీ చొప్పున 147 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు జిల్లాలో 32 వేల మంది రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. కాగా, 34 మండలాలలో రైతులు మామిడి పంటను పండించినట్లు తెలిపారు.