MDK: తూప్రాన్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు IPDS ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించినట్లు సూపర్వైజర్ శివకుమారి తెలిపారు. పోషణ మాసం పురస్కరించుకొని పోషణకు సంబంధించి వ్యాసరచన, డ్రాయింగ్, స్పీచ్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఫ్లోరెన్స్, అంగన్వాడి టీచర్లు శ్రీలత, ఉమా పాల్గొన్నారు.