సత్యసాయి: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ న్యూఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కలసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు ఆహ్వానించారు. భగవాన్ బాబా సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ, తన అత్తగారు 1966 నుండి బాబా భక్తురాలని పేర్కొన్నారు.