BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు. యాగశాలలో సుదర్శన నరసింహ యాగం నిర్వహించిన తర్వాత, స్వామివారిని గజవాహనంపై కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలో నిత్య కళ్యాణం నిర్వహించారు.