WNP: అమరచింత మండలం నాగల్ కడుమూర్లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొత్త సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో 7వ వార్డులో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహేందర్ రెడ్డి, అరుణ్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొని అభివృద్ధి పనుల వేగవంతంపై చర్చించారు.