MNCL: ఈనెల 5న కుక్కల దాడిలో గాయపడిన ఆరేళ్ల చిన్నారి అక్షిత ఘటనను బెల్లంపల్లి సివిల్ కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్‌తో పాటు కాసిపేట MPO సఫ్టర్ అలీ, ముత్యంపల్లి పంచాయతీ కార్యదర్శి మేఘనపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో MPO, కార్యదర్శి బుధవారం కోర్టుకు హాజరయ్యారు. కేసును ఈనెల 12న జడ్జి వాయిదా వేశారు.