MDK: అక్కెనపల్లి ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపాదికన బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జానయ్య తెలిపారు. పీజీటీ విభాగంలో జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, పౌర శాస్త్రం, గణితం ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26లోపు పాఠశాలలో ధ్రువపత్రాలను అందజేయాలని సూచించారు.