PDPL: అంగన్వాడీ కేంద్రాలలో అందించే పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో పూర్వ ప్రాథమిక విద్యపై అజీమ్ ప్రేమ్ జీ సంస్థ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి బృంద సభ్యులు, సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.