JGL: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం రూ.1,25,713 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఈఓ సంకటాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. వివిధ కార్యక్రమాల టికెట్ల ద్వారా రూ.67,791 రాగా, ప్రసాదాల ద్వారా రూ.40,700, అన్నదానం ద్వారా రూ.17,222 వచ్చినట్లు పేర్కొన్నారు.