ఖమ్మం జిల్లా: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి రవాణాను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల తీరు ప్రశంసనీయమని చెప్పారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన నెలవారి సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.