భద్రాద్రి: జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వీరభద్రపురం గ్రామంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని పరీక్షించి వైద్యం అందించారు. జ్వర పీడితుల నుండి రక్త నమూనా సేకరించి మందులు పంపిణీ చేయడం జరిగిందని వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.