NLG: గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తేలుకుంట్ల జగన్, కొప్పోలు గ్రామానికి చెందిన అయితగోని రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం వారి కుటుంబాలను నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పరామర్శించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.