జనగామ: చిలుపూర్ మండలం మల్కాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఆకస్మికంగా సందర్శించి రోగులతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అధ్యక్షుడు హోదాలో రాజయ్య ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి వైద్య విధానంపై సమీక్షించారు.