నారాయణపేట: జిల్లాలో భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులపై రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ విశాలాక్షీ, ఎసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.