ఖమ్మం: వైరా వన్ టౌన్ ఫీడర్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, వైరా రింగ్ రోడ్ నుంచి మధిర రోడ్డు, బస్టాండ్ ఏరియా, తాళ్లూరు అపార్ట్మెంట్, అమ్మ వాటర్ ప్లాంట్ ఏరియాలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు.